: అన్నం పెట్టడం లేదని కొడుకును గొంతు కోసి చంపిన తండ్రి

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో నిన్న జరిగిన హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతుని గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి చంపారని తొలుత భావించినప్పటికీ, ఈ హత్య వెనుక అసలు మిస్టరీని పోలీసులు కనిపెట్టారు. తన కొడుకు రెండు రోజులుగా అన్నం పెట్టకుండా ఏడిపించాడని, విపరీతంగా కొట్టేవాడని ఆరోపిస్తూ, అందుకే తాను కన్న కొడుకని కూడా చూడకుండా హత్య చేశానని మృతుడి తండ్రి దొనవల్లి లింగయ్య (75) పోలీసుల ఎదుట అంగీకరించడం సంచలనం కలిగించింది. తొలుత తనకేమీ తెలియదని, తాను నిద్రపోతున్న సమయంలో దారుణం జరిగిందని బుకాయించిన లింగయ్య చివరికి నిజం ఒప్పుకున్నాడు. హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

More Telugu News