: గ్రామస్థులపై కాల్పులు... విశాఖ జిల్లాలో కలకలం!

ఈ ఉదయం విశాఖ జిల్లాలో తుపాకి కాల్పుల మోత కలకలం రేపింది. జీకే వీధి మండలం చెరుకుపాకల వద్ద ఈ ఘటన జరిగింది. సుమోలో వచ్చిన కొందరు గ్రామస్థులపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో వారంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో కాల్పులు గాలిలోకే జరిగివుంటాయని భావిస్తున్నారు. కాల్పులు ఎవరు జరిపారన్న విషయమై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిపినట్టు చెరుకుపాకల గ్రామస్థులు వివరించారు. గ్రామస్థులను చూసి మావోయిస్టులనుకొని పోలీసులు కాల్పులు జరిపి ఉండవచ్చని కొందరు, ఎవరైనా దొంగలు ఆయుధాలతో సంచరిస్తూ ఉండవచ్చని మరికొందరు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

More Telugu News