: బుల్లి తెర 'ద్రౌపది' ఇంట్లో భారీ చోరీ

'ద్రౌపది'గా హిందీనాట ప్రతి ఇంటిని అలరించిన బుల్లి తెర నటి రూపాగంగూలీ ఇంట్లో చోరీ జరిగింది. ఆ మేరకు ఆమె ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సబర్బన్ వెర్సోవాలోని వినాకా అపార్ట్ మెంట్లో రూపా గంగూలీ నివాసం ఉంటున్నారు. ఇంట్లో దాచుకున్న 6 లక్షల రూపాయల నగదు, 65.05 లక్షల రూపాయల విలువ చేసే నగలు దోచుకుపోయినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ చోరీ విషయంలో రూపా గంగూలీ ఇంట్లోని పనిమనిషిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన అనంతరం పరారీలో ఉన్న ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

More Telugu News