: ఫిర్ ఏక్ బార్... బ్రిటన్ ప్రధాని నోట హిందీ మాట!

ఫిర్ ఏక్ బార్ కామెరూన్ సర్కార్... ఇదేదో హిందీ మాటలా ఉందే, మరి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పేరేమిటనేగా మీ అనుమానం! బ్రిటన్ లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. వచ్చే నెల 7న జరగనున్న ఎన్నికలకు సంబంధించి ప్రధాని పదవికి తిరిగి పోటీ చేస్తున్న ఆ దేశ ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరూన్, ఎడ్ మిలిబంద్ ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం కూడా హోరెత్తుతోంది. ఈ క్రమంలో ప్రధానిగా ఎవరు గెలవాలన్నా బ్రిటన్ లోని ఆసియావాసుల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆసియా వాసులను ఆకట్టుకునేందుకు ఎడ్ మిలిబంద్ కంటే ముందుగా డేవిడ్ కామెరూన్ మేల్కొన్నారు. ఆసియా వాసులను ఆకట్టుకునేందుకు కామెరూన్ ‘‘ఫిర్ ఏక్ బార్ కామెరూన్ సర్కార్’’ అంటూ భారతీయుల ఓట్లకు గాలమేశారు. ఇక కామెరూన్ నేతృత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ భారత సంతతి బ్రిటిషర్లను ఆకట్టుకునేందుకు ఏకంగా ‘ఆస్మాన్ నీలా’ పేరిట ఏకంగా ఓ పాటనే విడుదల చేసింది.

More Telugu News