: బురదలో పడిపోబోయిన హరీష్ రావు

తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బురదలో పడిపోబోయారు. మెదక్ జిల్లాలోని నుంగనూర్ ఎర్రచెరువులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జేసీబీ ఎక్కి పనులు ప్రారంభిద్దామని భావించారు. జేసీబీ ఎక్కుతుండగా, ఆయన కిందపెట్టిన కాలు బురదలో కూరుకుపోయింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన ఆయన కిందపడిపోబోయారు. దీనిని గమనించిన కార్యకర్తలు ఆయన కిందపడకుండా పట్టుకున్నారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది.

More Telugu News