: 15 రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా టీఎస్ మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్తున్నారు. మే నెల రెండో వారంలో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. మొత్తం 15 రోజులపాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పర్యటనకు వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ కానున్నారు.