: వైసీపీ నేతలను వెంటాడి మరీ చంపుతున్నారు: వాసిరెడ్డి పద్మ
అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ప్రసాద్ రెడ్డి హత్యను ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను అంతంచేసే కుట్రకు పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ నేతలను, కార్యకర్తలను వెంటాడి, వేటాడి మరీ చంపుతున్నారని పద్మ మండిపడ్డారు. అసలు ఏపీలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు.