: నేను పార్టీ మారడం లేదు: నాగం
నాగం జనార్దన్ రెడ్డి బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని, ఎప్పుడైనా పార్టీ మారవచ్చని, లేదా గతంలో తాను స్థాపించిన 'తెలంగాణ నగారా' పార్టీని పునరుద్ధరించవచ్చని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాజకీయాల్లో విలువలున్న మనిషినని, తాను పార్టీ మారడం లేదని చెప్పారు. మే 9 నుంచి 'బచావో తెలంగాణ మిషన్' పేరిట రాష్ట్రంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల ప్రదేశాలను సందర్శిస్తానని తెలిపారు. బీజేపీ తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో నాగం ఉన్నమాట నిజమేనని, అయితే పార్టీతో తాజాగా ఏదైనా రాజీ కుదిరిందా? అని అంతా అనుకుంటున్నారు.