: 'ఆపన్న హస్తం' అందివ్వడంలో మీరే మాకు స్ఫూర్తి... భారత్ పై అమెరికా ప్రశంసల జల్లు

ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో భారత్ చేపడుతున్న చర్యలను అగ్రరాజ్యం అమెరికా ఆకాశానికెత్తేసింది. కష్టకాలంలో ఉన్న పొరుగు దేశాలకు చేయందించడంలో మీరే మాకు స్ఫూర్తి అంటూ కీర్తించింది. పెను భూకంపం నేపథ్యంలో విలవిల్లాడుతున్న నేపాల్ కు భారత్ అందిస్తున్న సాయం గొప్పదని భారత్ లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. ఇటీవల సంక్షోభంలో చిక్కుకున్న యెమెన్ నుంచి విదేశీయులను సురక్షితంగా తరలించే విషయంలోనూ భారత్ మెరుగైన చర్యలు చేపట్టిందని ఆయన కితాబిచ్చారు. పొరుగు దేశాలకు సాయమందించడంలో భారత్, తన నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి చాటిచెప్పిందని వర్మ పేర్కొన్నారు. ‘‘భారత్ సహాయక చర్యలు ఎంతో గొప్పవి. మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాలో స్ఫూర్తిని నింపాయి’’ అని వర్మ వ్యాఖ్యానించారు. నేపాల్ ను ఆదుకునే విషయంలో అమెరికా తనవంతు సహకారాన్ని అందిస్తుందని కూడా ఆయన ప్రకటించారు.

More Telugu News