: కేసీఆర్ కు ఇంట్లో అభద్రతాభావం... బయట టీడీపీ భయం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పలు అంశాల విషయంలో ఆయనపై ధ్వజమెత్తిన రేవంత్, ఇంట్లో అభద్రతాభావంతో బాధపడుతున్న కేసీఆర్, బయట టీడీపీని చూస్తే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోకుండా, రైతు కుటుంబాలను విస్మరిస్తోందని మీడియాతో అన్నారు. అటు ఎన్నికల హామీలను పక్కన పడేసి మిషన్ కాకతీయ చెరువు పనుల పేరుతో లేనిపోని హడావుడి చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.

More Telugu News