: నేపాల్ లో నీలిమ సేఫ్... టింగోలో ఉన్నామంటూ స్నేహితురాలి ఫోన్
ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన హైదరాబాదు యువతి నీలిమ నేపాల్ లో సేఫ్ గానే ఉందట. ఈ మేరకు నీలిమ తల్లిదండ్రులకు ఆమె స్నేహితురాలు నీతూ ఫోన్ చేసింది. ప్రస్తుతం నేపాల్ లోని టింగో గ్రామంలో ఉన్నట్లు నీతూ శాటిలైట్ ఫోన్ ద్వారా సమాచారం అందించింది. ఈ విషయాన్ని నీలిమ బృందానికి ప్రయాణ ఏర్పాట్లు చేసిన ట్రావెల్స్ సంస్థ కూడా ధ్రువీకరించింది. కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన నీలిమ తండ్రి శౌరయ్య కూడా తన కూతురు క్షేమంగానే ఉందని చెప్పారు. నేటి సాయంత్రానికి నీలిమ నుంచి తమకు పూర్తి సమాచారం వచ్చే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు.