: భూకంప బాధితులకు మోదీ నెల జీతం విరాళం
ప్రధాని నరేంద్ర మోదీ భూకంప బాధితుల సహాయార్థం తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయనిధికి ఈ విరాళం అందజేసినట్టు పీఎంవో తెలిపింది. భూకంపం కారణంగా భారత్ లో ప్రాణాలు వదిలినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. నేపాల్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా భారత్ లో ఉత్తరాది రాష్ట్రాల్లో మరణాలు చోటుచేసుకున్నాయి. నేపాల్ లో 4000 మందికి పైగా మరణించినట్టు అక్కడి వర్గాలు చెబుతున్నాయి.