: మన సభకు బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా ఆ సభకు రాలేదు: కేసీఆర్
మహబూబ్ నగర్ లో టీడీపీ ఇటీవల నిర్వహించిన సభను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సెటైర్లు విసిరారు. సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో తమ సభకు బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా మహబూబ్ నగర్ సభకు రాలేదని ఎద్దేవా చేశారు. ఆ మాత్రం దానికే టీడీపీ వాళ్లు "ఆహా... ఓహో" అనుకుంటున్నారని విమర్శించారు. బాబు ఓ మూణ్నాలుగు పెంపుడు కుక్కలను వెంటేసుకు తిరుగుతున్నాడని, అవి ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నాయని కేసీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా, ఒకాయన తనతో ఇలా అన్నాడని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. గాడిదలు ఉంటేనే గుర్రాల విలువ తెలుస్తుందని ఆ వ్యక్తి అన్నారని తెలిపారు.