: ఇక ఇంట్లోనే హెచ్ఐవీ టెస్ట్... మార్కెట్లో సెల్ఫ్ టెస్టింగ్ కిట్
శరీరంలో ఎయిడ్స్ వ్యాధి ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి ఇకపై డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లక్కర్లేదు. ప్రపంచంలోనే తొలిసారిగా హెచ్ఐవీ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ బ్రిటన్ మార్కెట్లో విడుదలైంది. బయో షూర్ హెచ్ఐవీ సెల్ఫ్ టెస్ట్ పేరిట విడుదలైన ఈ కిట్ ను ఉపయోగించడం ద్వారా 15 నిమిషాల్లో 99.7 శాతం వరకూ కచ్ఛితమైన ఫలితాలు వెలువడతాయని తెలుస్తోంది. వేలి కొన నుంచి ఒక చుక్క రక్తం తీసుకొని కిట్ పై వేయాలని, ఆపై శరీరంలో వైరస్ ఉంటే రెండు పర్పుల్ లైన్స్ ప్రత్యక్షమవుతాయని, వారు తదుపరి రక్త పరీక్షలకు సిఫార్సు చేయబడినట్టు భావించాలని ఈ కిట్ ను విడుదల చేసిన టెర్రెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ తెలిపింది. ఈ కిట్ ను ఆన్ లైన్ లో కూడా కొనుగోలు చేయవచ్చని వివరించింది.