: మోదీ బాటలో అమెరికా, రష్యా ప్రభుత్వాలు... జన్ ధన్ ప్రారంభించే దిశగా చర్యలు!

భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తీసుకున్న పలు సాహసోపేత నిర్ణయాలకు ప్రపంచంలోని అగ్రదేశాలు నీరాజనాలు పలుకుతున్నాయి. అంతేకాదండోయ్, ఆయన నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల అమలు దిశగానూ కొన్ని దేశాలు వడివడిగా అడుగులేస్తున్నాయి. ప్రస్తుతం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనపై అమెరికా, రష్యా లాంటి దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. త్వరలో ఆ దేశాల్లో జన్ ధన్ తరహా పథకాలు అమలైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక సంస్థ ‘ద ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ ప్రస్తుతం జన్ ధన్ పై భారత ప్రభుత్వం అందజేసిన నివేదికను ఆమోదించిందట. జన్ ధన్ యోజన లక్ష్యాలు, అనతి కాలంలోనే ఈ పథకం దిగ్విజయమైన తీరు, నో యువర్ కస్టమర్ తరహా వ్యవస్థలపై భారత ప్రభుత్వం ఆ సంస్థకు నివేదిక అందించింది. సదరు నివేదికను అధ్యయనం చేసిన ఆ సంస్థ పథకం విజయవంతమైన తీరును ప్రపంచ దేశాలకు వివరించనుంది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంకు ఖాతా అయినా ఉండాలన్న యోచనతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకానికి తెర తీసిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు కంటే ముందుగానే ఈ పథకానికి భారీ స్పందన వచ్చింది. అయితే తమ దేశాల ఆర్ధిక కార్యకలాపాలకు దూరంగా ఉన్న మెజారిటీ మంది ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే దిశగా యోచిస్తున్న ప్రపంచ దేశాలకు జన్ ధన్ యోజన ఉపకరిస్తుందని ‘టాస్క్ ఫోర్స్’ సంస్థ చెబుతోంది.

More Telugu News