: సేవ చేయడానికే నన్ను దేవుడు బతికించాడు: బాబా రాందేవ్

తనను దేవుడు బతికించాడంటే కారణం ఇంకా సేవ చేయమని చెప్పడమేనని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ తెలిపారు. ఖాట్మాండులో ఆయన మాట్లాడుతూ, భూకంప బాధితులకు సహాయం చేసేందుకు మరికొంత కాలం ఇక్కడే ఉంటానని చెప్పారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టానని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు. కాగా, నిన్న సంభవించిన పెను భూకంపం ధాటికి ఆయన శిక్షణ ఇచ్చిన వేదిక కూలిపోయింది. అప్పటివరకు ఆయన వేదికపై ఉండి కిందికి దిగినట్టు ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.

More Telugu News