: మీడియా ముందుకు నీతూ అగర్వాల్... స్టేషన్ లో కన్నీటి పర్యంతమైన వైనం
ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీని పెళ్లి చేసుకుని ఆ చీకటి దందాలో అతడికి సహకరించిన టాలీవుడ్ హీరోయిన్ నీతూ అగర్వాల్ పట్టుబడింది హైదరాబాదులో కాదట. హైదరాబాదు నుంచి కారులో బెంగళూరుకు పారిపోతూ కర్నూలు జిల్లా ఉలిందకొండ వద్ద ఆమె పోలీసులకు చిక్కింది. కొద్దిసేపటి క్రితం ఆమెను కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాలో నీతూ పాత్ర ఉందని ఆధారాలు లభించిన తర్వాతే ఆమెను అరెస్ట్ చేశామని చెప్పారు. నీతూ బ్యాంకు ఖాతా నుంచి స్మగ్లర్లకు రూ.1 లక్ష మాత్రమే బదిలీ అయినట్లు కూడా ఎస్పీ చెప్పుకొచ్చారు. ఇధిలా ఉంటే, పోలీసులకు పట్టుబడిన నీతూ, తన స్వస్థలం రాజస్థాన్ అని చెప్పిందట. పోలీసులకు చిక్కగానే ఏడుపు లంకించుకున్న నీతూ, పోలీస్ స్టేషన్ లో గుక్క తిప్పుకోకుండా ఏడ్చిందట. మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగానూ నీతూ ఏడుస్తూనే కనిపించింది.