: భూకంప మృతుల్లో భారత ఎంబసీ ఉద్యోగి కుమార్తె.. భార్య పరిస్థితి విషమం
నేపాల్ లో సంభవించిన భూకంపం ఎందరి ప్రాణాలనో బలిగొంది. రాజధాని ఖాట్మండూ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. నగరంలోని భారత రాయబార కార్యాలయం పూర్తిగా దెబ్బతిన్నట్టు సమాచారం. మృతుల్లో రాయబార కార్యాలయ ఉద్యోగి మదన్ కుమార్తె కూడా ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ట్వీట్ చేశారు. కాగా, భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నేపాల్ పయనమయ్యాయి. అక్కడి సహాయక చర్యల్లో ఈ బృందాలు పాలుపంచుకుంటాయి. నేపాల్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్ చేసి, అన్ని విధాలా సాయపడతామని హామీ ఇచ్చారు.