: మిషెల్ ఒబామాను విచిత్రమైన ప్రశ్న వేసిన చిన్నారి


పిల్లలకి ఏదైనా సందేహం వస్తే తీర్చుకునే వరకు ఊరుకోరు. వారి కల్మషంలేని పలుకులు విని ఎవరైనా ఆస్వాదించాల్సిందే. అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అలాంటి అనుభవాన్ని ఆస్వాదించి, మనసారా నవ్వుకున్న సంఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని శ్వేత సౌధంలో బాలికా విద్యపై జరుగుతున్న సమావేశంలో ఆ దేశ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా పాల్గొన్నారు. అందులో భాగంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది. ఇంతలో బ్రొడె అనే చిన్నారి, నింపాదిగా మిషెల్ ఒబామాను సమీపించింది. మీ వయసెంత? అని మిషెల్ చెవిలో చిన్నగా అడిగింది. దానికామె 51 ఏళ్లు అంటూ సమాధానమిచ్చింది. అవునా? మరి మీరు చాలా చిన్నగా ఉన్నారేంటి? అని అమాయకంగా ప్రశ్నించిందా చిన్నారి. చిన్నారి ముద్దు మాటలకు ముచ్చటపడిన మిషెల్ ఒబామా మనస్పూర్తిగా పగలబడి నవ్వి చిన్నారిని గుండెలకు హత్తుకున్నారు.

  • Loading...

More Telugu News