: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు

చెన్నై నుంచి హౌరా వెళుతున్న కోరమాండల్ ఎక్స్‌ ప్రెస్‌ (12842)లో మంటలు చెలరేగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో రైలు క్రాసింగ్ నిమిత్తం ఆగివున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు విద్యుదాఘాతం కారణమని ప్రాథమిక అంచనా. విద్యుత్ వైర్లు షార్ట్ కావడంతో ఒక బోగీలో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను ఆపివేశారు. సంఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News