: కిటకిటలాడుతున్న విశాఖ స్టేడియం... టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్-8 సీజన్లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ మొదలుకానుంది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ జెపీ డుమినీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ విశాఖలో జరుగుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్ కాగా, తొలి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. వీరి సందడితో స్టేడియం కోలాహలంగా మారింది.