: ఉల్లంఘనులు ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం...!

అరాచకాల ఉత్తరప్రదేశ్ లోనే మానవ హక్కుల ఉల్లంఘనలు అధికంగా ఉన్నాయని జాతీయ మానవహక్కుల సంఘం తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ నుంచే ఎక్కువ ఉల్లంఘనలు జరుగుతున్నాయని మానవ హక్కుల నివేదికలో పేర్కొంది. ఉత్తరప్రదేశ్ పోలీసులకు వ్యతిరేకంగా ఏటా 20 వేల ఫిర్యాదులు అందుతున్నాయని మానవ హక్కుల సంఘం పేర్కొంది. దాని తరువాతి స్థానంలో హర్యానా, ఢిల్లీలు ఉన్నాయని మానవ హక్కుల సంఘం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఏటా 2000 నుంచి 2,800 ఫిర్యాదులు అందుతున్నాయని ఆ సంఘం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీసులపై సుమారు 200 హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులు అందుతున్నాయని జాతీయ మానవ హక్కులు సంఘం తెలిపింది. జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఫిర్యాదులు లేకపోవడం విశేషం.

More Telugu News