: బాంబులు పెడుతూ... అవి పేలి మరణించిన పాక్ ఐఎస్ చీఫ్ హఫీజ్ సయీద్
పాకిస్థాన్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అధిపతిగా పనిచేస్తున్న హఫీజ్ మహమ్మద్ సయీద్ బాంబు పేలి మృతి చెందాడు. వాయవ్య పాక్ పరిధిలోని ట్రైబల్ రీజియన్ లో రోడ్డు పక్కన బాంబులు అమరుస్తుండగా, అవి పేలి హఫీజ్ దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. హఫీజ్ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఈ ఘటనలో మరణించినట్టు 'ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' ప్రకటించింది. ఈ విషయంలో ఐఎస్ వర్గాల నుంచి ఇంకా ఎటువంటి సమాచారమూ రాలేదు. గత సంవత్సరం లో పాక్ ఐఎస్ చీఫ్ గా నియమించబడ్డ హఫీజ్ పై పలు కేసులు ఉన్నాయి.