: 'మా' అధ్యక్షుడిగా గెలిచిన రాజేంద్ర ప్రసాద్
నాటకీయ పరిణామాల మధ్య జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం 7 రౌండ్ల పాటు కౌంటింగ్ జరుగగా, రాజేంద్ర ప్రసాద్ 85 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్టు తెలిసింది. మొత్తం 702 ఓట్లు ఉన్న 'మా'లో 394 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. దీంతో, ఫిలిం ఛాంబర్ వద్ద ఆయన అనుకూల వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.