: సన్ రైజర్స్ హైదరాబాద్ 127/5
సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు రాజస్థాన్ బౌలింగ్ ధాటికి విశాఖలో తేలిపోయింది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సీజన్ లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు కేవలం 127 పరుగులు మాత్రమే సాధించింది. హైదరాబాదు ఆటగాళ్లలో వార్నర్ (21), ధావన్ (10), రాహుల్ (2), నమన్ ఓజా (25), ఇయాన్ మోర్గాన్ (27), రవి బొపారా (23), ఆశిష్ రెడ్డి (13) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో ధావల్ కులకర్ణి (2), ప్రవీణ్ తంబే (2) రాణించారు. 128 పరుగుల విజయలక్ష్యంతో రాజస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.