: బుద్ధి చూపించుకున్న మస్రత్ ఆలం

నరనరాన భారత వ్యతిరేకతను నింపుకున్న వేర్పాటు వాది మస్రత్ ఆలం ఆగడాలు ప్రారంభమయ్యాయి. సుదీర్ఘకాలం జైలులో గడిపిన మస్రత్ ఆలం ఇటీవలే విడుదలై, ఇప్పుడు జమ్మూకాశ్మీర్ లో భారత వ్యతిరేక ర్యాలీ నిర్వహించాడు. ఈ ర్యాలీలో పలువురు యువకులు పాల్గొన్నారు. ర్యాలీలో పాకిస్థాన్ జెండాలను పట్టుకుని, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జమ్మూకాశ్మీర్ లో శాంతి భద్రతల పరిరక్షణకు భద్రతా బలగాలు ప్రతిక్షణం పహారా కాస్తున్నాయి. వారి లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు కాల్పులు, బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారు. వారి అనాగరిక చర్యలకు ఎంతో మంది కాశ్మీరీలు, భద్రతా బలగాలు బలవుతున్నప్పటికీ ఆలం ర్యాలీ చేయడం, దానికి అనుమతివ్వడంపై దేశవ్యాప్తంగా మండిపడుతున్నారు. అలాంటి వాడిని విడుదల చేయడమే తప్పని పలువురు పేర్కొంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ర్యాలీలు చేయడం, తద్వారా రేగిన అల్లర్లలో భద్రతా బలగాలపై రాళ్లదాడులు చేయడం ద్వారా ఆలం పాప్యులారిటీ సంపాదించాడు.

More Telugu News