: ‘సత్యం’ రాజు పిటిషన్ పై వాదనలు పూర్తి... తీర్పు ఈ నెల 20 కి వాయిదా!

సత్యం కంప్యూటర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ అక్రమాలకు కీలక బాధ్యుడు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజులు దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కొద్దిసేపటి క్రితం వాదనలు పూర్తయ్యాయి. సీబీఐ తమపై మోపిన అభియోగాలు వాస్తవమని తేలుస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని రాజు సోదరులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై రాజు సోదరులు, సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలను విన్న కోర్టు వాదనలు ముగిసినట్లు ప్రకటించింది. తీర్పును ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

More Telugu News