: పట్టిసీమ పూర్తయితే ‘పిల్ల కాంగ్రెస్’ అడ్రెస్ గల్లంతే: రైల్వే కోడూరులో నారా లోకేశ్
పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో ప్రారంభించనున్న బస్సు యాత్రపై టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. పట్టిసీమపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పట్టిసీమ పూర్తయితే ‘పిల్ల కాంగ్రెస్’ అడ్రెస్ గల్లంతేనని కూడా ఆయన వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కార్యకర్తల సంక్షేమ యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితం కడప జిల్లా రైల్వే కోడూరు చేరుకున్న లోకేశ్, జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.