: జగన్ గారూ... ఈడీ కేసులపై నోరు విప్పరేం?: ఏపీ హోం మంత్రి చినరాజప్ప ప్రశ్న

పట్టిసీమపై పోరు యాత్ర ప్రారంభిస్తున్న ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార పక్షం ముప్పేట దాడికి దిగింది. నేటి ఉదయం కృష్ణా జిల్లాలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడగా, వెనువెంటనే తూర్పు గోదావరి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రంగంలోకి దిగారు. ‘‘జగన్ గారూ... ఈడీ కేసులపై నోరెందుకు విప్పడం లేదు?’’ అంటూ ప్రతిపక్ష నేతను చినరాజప్ప నిలదీశారు. జగన్ బస్సు యాత్రను రాజకీయ మనుగడ కోసం సాగిస్తున్న యాత్రగా చినరాజప్ప అభివర్ణించారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన ఆయన, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని రాష్ట్రానికి తీసుకువచ్చి, అసలు నిందితుల పేర్లను బయటకు తీసుకొస్తామని ప్రకటించారు.

More Telugu News