: ఆటోలో వచ్చి యువతిపై యాసిడ్ దాడి
హైదరాబాద్ లో అత్యంత బిజీగా ఉండే పంజాగుట్టలో ఘోరం జరిగింది. ఒక యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ సమీపంలో రహదారిపై నడిచివెళుతున్న యువతిపై ఆటోలో వచ్చిన ఒక యువకుడు యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడిలో యువతికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. కేసు నమోదుచేసి యాసిడ్ దాడి చేసిన దుండగుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.