: డాక్టర్ చెంపలు వాయించిన సింగర్ మికా

ప్రముఖ గాయకుడు, 'సింగ్ ఈజ్ కింగ్' ఫేం మికా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఆప్తమాలజిస్టులు మూడు రోజుల సదస్సు నిర్వహించారు. చివరి రోజున పాట కచేరీ నిమిత్తం సింగర్ మికాను ఆహ్వానించారు. లైవ్ కాన్సర్ట్ ముగిసే సమయంలో కొందరు డాక్టర్లను మికా వేదికపైకి ఆహ్వానించాడు. డయాస్ పై ఏమి జరిగిందో తెలియలేదుగానీ, తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ శ్రీకాంత్ అనే డాక్టర్ చెంపలు వాయించి బౌన్సర్లకు అప్పగించాడు. దీనిపై మిగతా డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసులు రంగప్రవేశం చేసి మికాపై కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పి పరిస్థితిని అదుపు చేశారు. గతంలో కూడా ఒక అభిమానిని కొట్టిన మికా పోలీసు కేసును ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

More Telugu News