: 'చైనా యాపిల్' జియోమీని ఏపీకి తెచ్చే లక్ష్యంతో బాబు అడుగులు
చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు బృందం రెండో రోజు 'చైనా యాపిల్'గా గుర్తింపు తెచ్చుకున్న జియోమీతో పాటు ఫాక్స్ కాన్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన నవ్యాంధ్రలో పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు. సాఫ్ట్ వేర్ రంగంలో అసమాన ప్రతిభను భారతీయులు ఇప్పటికే కనబరిచారని తెలిపారు. ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయమని ఆయన వివరించారు. అనుమతులు కోరితే 21 రోజుల్లోనే లభ్యమయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రానికి 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. బాబు ప్రసంగాన్ని విన్న జియోమీ, ఫాక్స్ కాన్ ప్రతినిధులు ఏపీలో ప్లాంట్ల విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.