: రోజా మహిళా జాతికే అవమానం కలిగేలా వ్యవహరిస్తున్నారు: మంత్రి సుజాత
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మహిళా జాతికే అవమానం కలిగేలా ప్రవర్తిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, రోజా శాసనసభ సంప్రదాయాలు మంటగలుపుతున్నారని అన్నారు. దళితులను అవమానించేలా రోజా వ్యాఖ్యలు చేస్తూ వివాదం రేపుతున్నారని, ఆమె వ్యాఖ్యల్లో అసభ్య పదజాలం చోటుచేసుకుంటోందని ఆమె మండిపడ్డారు. ఏపీ శాసనసభ సమావేశాల సందర్భంగా రోజా, మంత్రి సుజాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, అవి పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.