: రక్తమోడిన ఏపీ... రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి

ఆంధ్రప్రదేశ్ లో రహదారులు రక్తమోడాయి. ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కేరళ వాసులు కారులో తిరుమలకు వెళ్తుండగా, వారి కారు చవటపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఆశ (35)తో పాటు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో హరికృష్ణ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఘటనలో ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద టిప్పర్ ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరంతా ఒంగోలు వాసులుగా తెలుస్తోంది.

More Telugu News