: ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడ్ని పార్టీ కార్యాలయంలో నిర్బంధించిన కార్యకర్తలు
ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తూ జిల్లా అధ్యక్షుడ్ని పార్టీ కార్యాలయంలో నిర్బంధించి, తాళం వేసే వరకు పరిస్థితి వెళ్లిందంటే విభేదాలు ఏ స్థాయిలో వున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం పట్టణంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో శ్రమించిన తమను పక్కన పెట్టి, కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నుంచి పార్టీలో చేరిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా టీఆర్ఎస్ వారిమేనని వాదించారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. దీంతో, కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు దిండిగల్ రాజేందర్ ను పార్టీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు.