: టీటీడీ అధ్యక్షుడిగా చదలవాడ కృష్ణమూర్తి... కాసేపట్లో ఉత్తర్వులు

తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా తెలుగుదేశం సీనియర్ నేత చదలవాడ కృష్ణమూర్తిని ఏపీ ప్రభుత్వం నియమించింది. దానికి సంబంధించి కాసేపట్లో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన టీటీడీ బోర్డులో పొరుగు రాష్ట్రాల వారికి కూడా చోటు కల్పించినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి కూడా బోర్డులో పలువురికి అవకాశం దక్కినట్టు సమాచారం. రేపు చైనా పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ జాబితాను ఖరారు చేశారు.

More Telugu News