: ఆ వరసలో మాత్రం నేను ఉండను!: పోసాని కృష్ణ మురళి

'దోచెయ్' ఆడియో వేడుకలో దర్శకుడు సుధీర్ వర్మ గురించి మాట్లాడుదామని అనుకున్నానని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నాడు. ఆడియో వేడుక సందర్భంగా దోచెయ్ సినిమాలో తనపై చిత్రీకరించిన పాటను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పుడు నన్ను మాట్లాడమంటే, ఆయన గురించి మాట్లాడితే అంతా ఏమనుకుంటారోనని ఆలోచిస్తున్నానని అన్నారు. సినిమాను ప్రేమించే దర్శకుల్లో సుధీర్ వర్మ ముందువరుసలో ఉంటారని ఆయన చెప్పారు. "నేను సినిమాలకు మాటలు రాశాను, దర్శకత్వం వహించాను. కానీ ఆ వరసలో మాత్రం ఉండను" అని ఆయన చెప్పారు. నాగచైతన్య గురించి చెప్పడానికి కొత్తగా ఏమీ లేదని, ఆయన పెద్ద నటుడి మనవడు, మరోపెద్ద నటుడి కుమారుడు, ఇప్పుడు యంగ్ రొమాంటిక్ హీరో అని అన్నారు. నటి బాలీవుడ్ లో కూడా నటించడంతో గుర్తింపు ఉందని ఆయన చెప్పారు.

More Telugu News