: ఎస్పీగా కోర్టుకెళ్లి... డీఐజీగా తిరిగివచ్చిన సీబీఐ అధికారి!

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి నిన్నటి రోజు శుభదినమనే చెప్పాలి. ఎందుకంటే, ఆ సంస్థ దర్యాప్తు చేసిన అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణంలో నిందితులకు శిక్ష పడింది. సంస్థ బాసుల నుంచి ఏపీ శాఖ అధికారులకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే నిన్నటి రోజు ఒక్క సీబీఐకే కాక ఆ సంస్ధ హైదరాబాదు రేంజి ఎస్పీ చంద్రశేఖర్ కు కూడా మంచిరోజే. ఎస్పీ హోదాలో కోర్టుకెళ్లిన ఆయన సాయంత్రానికల్లా డీఐజీ హోదాలో ఇంటికి చేరుకున్నారు. సత్యం కేసులో సీబీఐ విజయం సాధించిన రోజే ఆ సంస్థ అధికారికి పదోన్నతి రావడం గమనార్హం.

More Telugu News