: నిద్రలోనే మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రిచీ బెనాడ్ (84) ఈ ఉదయం మరణించారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన నిద్రలో ఉండగానే కన్నుమూశారని చానల్ నైన్ ప్రకటించింది. వయసు పైబడడంతో ఆయన శరీరం వైద్యానికి సహకరించలేదని తెలుస్తోంది. తన కెరీర్లో 63 టెస్ట్ మ్యాచ్ లలో ఆడిన రిచీ బెనాడ్, 2000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందారు. బౌలింగ్ లో 27.0కు పైగా సగటుతో 248 టెస్ట్ వికెట్లను తీశారు. బెన్నాడ్ 28 టెస్ట్ లకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించి అన్నింటా విజయం సాధించిన కెప్టెన్ గా అరుదైన ఘనతను అందుకున్నారు. 16 సార్లు ఐదు వికెట్లను తీసిన క్రికెటర్ గా నిలిచాడు. 1952లో వెస్టిండీస్ పై తొలి టెస్ట్ ఆడిన బెనాడ్, 1964లో సౌతాఫ్రికాపై చివరి టెస్ట్ తో తన క్రికెట్ జీవితానికి వీడ్కోలు పలికారు. ఆపై నాలుగు దశాబ్దాలకు పైగా క్రికెట్ వ్యాఖ్యాతగా సేవలందించారు. బెన్నాడ్ మృతిపై పలువురు ప్రముఖులు, ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు.

More Telugu News