: ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు అవమానం!

భద్రాచలం నియోజకవర్గ సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు అసెంబ్లీ సాక్షిగా అవమానం జరిగింది. వామపక్ష పార్టీకి చెందిన రాజయ్య ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. మెయిన్ గేటు ద్వారా లోపలికి వెళ్లేందుకు ఆయన రాగా, ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని ఎంత చెప్పినప్పటికీ భద్రతా సిబ్బంది ఆయనను లోపలికి పంపలేదు, సరికదా, ఎమ్మెల్యే అయితే ఐడీ కార్డు చూపించాలని అడిగారట. దీంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే, ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది తీరుపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. దీనిపై అక్కడున్న చాలా మంది ఆశ్చర్యపోయారట. ఆటోలో వస్తే ఎమ్మెల్యేలు కాదా? లేక ఎమ్మెల్యేలు ఆటోలో రారా? అంటూ ముక్కున వేలేసుకున్నారట.

More Telugu News