: 'మూడీస్' మద్దతుతో దూకిన 'బుల్'!

ఇండియాపై తమ దృక్పథాన్ని 'స్థిరం' నుంచి 'పాజిటివ్'కు మార్చుకున్నామని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ 'మూడీస్' ప్రకటించడం మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను నిలిపింది. దీంతో ఒడిదుడుకుల మధ్య సాగిన సెషన్ లో బెంచ్ మార్క్ సూచికలు తృప్తికరమైన లాభాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు, ఫండ్ సంస్థలూ, రిటైల్ పెట్టుబడిదారులు కొత్తగా బ్యాంకింగ్ రంగంలోని కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపారు. ఇదే సమయంలో రోజువారీ 'షార్ట్ గేమ్' ఆడే ఇన్వెస్టర్లు నష్టాల పాలయ్యారు. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ సూచీ 177.46 పాయింట్లు పెరిగి 0.62 శాతం లాభంతో 28885.21 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ సూచీ 63.90 పాయింట్లు పెరిగి 0.73 శాతం లాభంతో 8,778.30 పాయింట్ల వద్ద కొనసాగాయి. బీఎస్ఈలో బ్యాంకెక్స్ అత్యధికంగా 2.58 శాతం లాభపడింది. మెటల్స్ 1.43 శాతం పెరిగింది. హెల్త్ కేర్, రియాల్టీ తదితర సెక్టార్లు 1 నుంచి 2 శాతం నష్టపోయాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.68 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 4.88 శాతం ఈక్విటీ విలువను పెంచుకున్నాయి.

More Telugu News