: కర్నూలు జిల్లాలో అల్లు అర్జున్ అభిమానుల ధర్నా
తమ అభిమాన హీరో అల్లు అర్జున్ కు అన్యాయం జరిగిందని ఆయన అభిమానులు ఆగ్రహించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ధర్నాకు దిగారు. అల్లు అర్జున్ కొత్త చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి విడుదల సందర్భంగా, రెండు వర్గాల అభిమానుల మధ్య ఫ్లెక్సీల విషయంలో రగడ జరిగింది. తమ ఫ్లెక్సీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఒక వర్గం వారు వాగ్వాదానికి దిగి, చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు కల్పించుకోవడంతో సమస్య సద్దుమణిగింది. సన్నాఫ్ సత్యమూర్తి నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.