: అణుశక్తి కోసం మోదీ 'షాపింగ్'!

పెద్దఎత్తున న్యూక్లియర్ రియాక్టర్లు, అణు ఇంధనం కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ మూడురోజుల ఫ్రాన్స్, కెనడా పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. మహారాష్ట్రలో 1,650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న రెండు రియాక్టర్ల నిర్మాణానికి ఫ్రాన్స్ అధికారులతో ప్రధాని బేరసారాలు నడపనున్నారు. ఈనెల 11 వరకూ జరిగే పర్యటనలో భారత అణుశక్తి మరింత మెరుగుపడేలా నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో నత్తనడకన సాగిన అణుశక్తి ప్రాజెక్టులు, మోదీ మూడు రోజుల విదేశీ పర్యటన ద్వారా పరుగులు పెడతాయని భావిస్తున్నట్టు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అటు సాంకేతికతతో పాటు, వాణిజ్య పరమైన అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయని ఆయన తెలిపారు. క్లీన్ ఎనర్జీ దిశగా అణు ఇంధనం కీలకమని భావిస్తున్న మోదీ, భారత్ కు అణు పరిజ్ఞానాన్ని ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్న అగ్రరాజ్యలపై ఇటీవల విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

More Telugu News