: ఎవరేం తిడితే నాకేంటి, పట్టించుకోను!: కేజ్రివాల్

కేవలం పరిపాలన మీద మాత్రమే దృష్టిని పెట్టానని, ఎవరు ఏ విధంగా తిట్టుకున్నా పట్టించుకోబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. పార్టీలోని అంతర్గత వ్యవహారాలు పాలనపై ప్రభావం చూపబోవని చెప్పారు. సీఐఐ అధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీలో విబేధాలపై ప్రశ్నించగా సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. పరిపాలనేతర విషయాలపై స్పందిచనని స్పష్టం చేశారు. పార్టీ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలపట్ల చెప్పడానికి ఏమీ లేదని కేజ్రివాల్ అన్నారు. మీడియాలో ప్రచారం పొందడం కోసం తనను ఏమైనా తిట్టొచ్చని, అవి తన ప్రభుత్వంపై ప్రభావం చూపలేవని చెప్పారు.

More Telugu News