: పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే, చైనా కంటే భారత్ ముందుండేది: కంచె ఐలయ్య

సామాజికవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హయాంలో దేశంలో అభివృద్ధి ఆశించిన మేర నమోదు కాలేదన్న రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. భారత తొలి ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పదవీ బాధ్యతలు చేపట్టి ఉంటే, భారత్ అభివృద్ధిలో పరుగులు పెట్టేదని ఆయన అన్నారు. అంతేకాక అభివృద్ధిలో ముందువరుసలో ఉన్న అమెరికా, చైనాలను భారత్ ఎప్పుడో అధిగమించి ఉండేదని కూడా ఐలయ్య అన్నారు. పాలమూరు వర్సిటీలో నిన్న జరిగిన దళిత విద్యార్థి సంఘాల సమాఖ్య సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని అంబేద్కర్ కాకుండా వేరేవారు రాసి ఉంటే, నేడు భారత్ లో బ్రిటిష్ తరహా పాలన సాగేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News