: పట్టిసీమతో ఎలాంటి నష్టంలేదు: మాజీ మంత్రి గాదె

ఏపీ ప్రభుత్వం పతిష్ఠాత్మకంగా చేపడుతున్న పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై పలువురు నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వేళ మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎటువంటి నష్టంలేదని చెప్పారు. అంతేగాక పోలవరానికి, పట్టిసీమకు ఎలాంటి పోలిక కూడా లేదన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని పట్టిసీమ ద్వారా తీసుకోవడంవలన డెల్టాతో పాటు రాయలసీమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని గాదె పేర్కొన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, బీజేపీ ప్రభుత్వం ఆ ప్రాంతాలను పట్టించుకుని ఆర్డినెన్స్ జారీ చేసిందని గుర్తు చేశారు.

More Telugu News