: అమెరికాలో గుంటూరు వాసిని హత్య చేసిన నల్లజాతీయులు

అమెరికాలో నల్లజాతీయుల చేతిలో గుంటూరు జిల్లా వాసి మాదాల రాజేష్ హత్యకు గురయ్యాడు. డబ్బుకోసమే రాజేష్ హత్యకు గురైనట్టు అతని భార్య నాగమణి బంధువులకు సమాచారం అందించారు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పియోరియా అనే ప్రాంతంలోని గ్యాస్ కంపెనీలో రాజేష్ విధులు నిర్వర్తిస్తున్నాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన రాజేష్ ఎమ్మెస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి యూఎస్ వెళ్లాడు. గ్యాస్ కంపెనీ వద్దకు వచ్చిన నల్లజాతీయులు రాజేష్ ను డబ్బు డిమాండ్ చేసి, ఘర్షణ పడ్డట్టు, అనంతరం వారు అతనిని కాల్చి చంపినట్టు గ్యాస్ కంపెనీ యజమాని నాగమణికి సమాచారం అందించారు.

More Telugu News