: అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోండి: కేంద్రాన్ని కోరిన సోనియా

దేశ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మద్దతు తెలిపారు. ఈ వర్షాల కారణంగా దెబ్బతిన్న గోధుమలను రాజస్థాన్ లోని కోటాకు చెందిన రైతుల నుంచి సేకరించేందుకు ఎఫ్ సీఐ తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన క్రమంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల నేపథ్యంలో ఎఫ్ సీఐ నిబంధనలు సడలించాలని సోనియా కోరారు. రబీ గోధుమ పంటలో 14 శాతం తేమ ఉంటే అటువంటి గోధుమ సేకరించడానికి సరికాదని ప్రభుత్వం తిరస్కరిస్తుందని ఇప్పటికే ఎఫ్ సీఐ మాన్యువల్ చెబుతోందని పేర్కొన్నారు. అదే తేమ 12% నుంచి 14% మధ్య ఉంటే అదనపు డిస్కౌంట్ ఇస్తారన్నారు. కానీ సాధారణ పరిస్థితుల్లో అటువంటి నిర్దేశాలను పక్కనబెట్టి, రైతుల పట్ల సానుభూతితో ప్రభుత్వం వ్యవహరించాలని లేఖలో సోనియా కోరారు.

More Telugu News