: అసలు స్మగ్లర్లను వదిలేసి కూలీలను చంపుతారా?: బాబు సర్కారుపై కాంగ్రెస్ ఫైర్

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ మనవ హక్కుల ఉల్లంఘనేనని కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి నిప్పులు చెరిగారు. మరణించిన వారంతా కూలీలేనని ఆయన అన్నారు. అసలు స్మగ్లర్లను వదిలేసి అమాయకులను కాల్చి చంపడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే పొట్ట కూటి కోసం వచ్చిన అమాయకుల ప్రాణాలు మిగిలేవని అన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల సంఘానికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. అడవుల్లోకి సుమారు 150 మంది వస్తున్నారన్న సమాచారం ముందే తెలిసిందని అధికారులు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అలాంటప్పుడు వారిని ముందే ఎందుకు అడ్డుకోలేదని విమర్శించారు.

More Telugu News