: ఎవరు పెట్టారో... విమానం టాయిలెట్‌ లో రూ. 48 లక్షల విలువైన బంగారం!

చెన్నై నుంచి ముంబై వెళ్లాల్సిన జెట్ ఎయిర్‌ వేస్ విమానంలోని టాయిలెట్‌ లో కిలోన్నర బరువున్న బంగారం కడ్డీలు బయటపడ్డాయి. సింగపూర్ నుంచి చెన్నైకి గత రాత్రి చేరుకున్న ఈ విమానం ముంబైకి వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులు దిగిన వెంటనే టాయిలెట్‌ ను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడో నల్లని సంచిని చూసి బాంబుగా భయపడ్డారు. బాంబ్‌ స్క్వాడ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు పరిశీలించి చూడగా అందులో రూ.48 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు ఉన్నాయి. బంగారాన్ని ముంబైకి చేరవేసేందుకు విమానాశ్రయ సిబ్బంది ఎవరో స్మగ్లర్లకు సహకరించి ఉండవచ్చన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

More Telugu News